విధాత : రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ నుంచి హుడియో హుడియో పూర్తి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘హుడియో హుడియో’ అంటు ప్రారంభమై…నా గుండె గాలిపటమల్లే ఎగిరేసావే.. నీ చుట్టూ పక్కల తిరిగేలా గిరిగిసావే.. నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేశావే.. నీ కంటి చూపులతో కలలను ఉరి తీసావే అంటూ సాగింది. చిట్టి చిలక చిన్ని మొలక..పెట్టి వెళ్లకే…నా గుండె మెలిక..అంటూ హుషారుగా సాగింది. ఈ పాటను దేవ్ రాయగా.. హేశం అబ్దుల్ వహాద్, భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. అంతకుముందు విడుదలైన ‘ఓలే ఓలే’ సాంగ్ మాస్ బీట్ తో సాగితే ఈ పాట మెలోడిగా సాగింది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు.
అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు.