విధాత: దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘కృష్ణలీల’ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. దేవన్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ‘కృష్ణలీల’ చిత్రానికి తిరిగొచ్చిన కాలం.. అనేది ట్యాగ్‌లైన్ గా ఉంది. ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అసక్తిని, అంచనాలను పెంచేదిగా ఉంది. ‘మనసులోని ప్రేమను ప్రేమించిన వారికి చెప్పే అవకాశం కలిగిస్తే ఎలాంటి అనర్థాలు జరగవు’ అంటూ హీరో దేవన్ డైలాగ్…. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వచ్చాడా? ఎవరీ క్రేజీ మ్యాన్ అనే డైలాగ్స్ తో పాటు ట్రైలర్ లోని హీరోహీరోయిన్ల గత జన్మల సన్నివేశాలు ట్విస్టులతో సాగుతూ ఆసక్తి పెంచాయి.
మైథలాజికల్ బ్యాక్ గ్రౌండ్ తో రెండు జన్మలతో ముడిపడిన లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని..మొత్తానికి దర్శకుడు ఓ ప్రేమకథను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. అర్జునా…నేను దీని కోసమే పుట్టాను..అనే భావనతో ఆ పనిని ధర్మబద్దంగా తపస్సులా చేయడమే నిజమైన కర్మ..ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతివ్యక్తితోనూ జన్మంతర సంబంధం ఉంటుంది..ఆ బంధాన్ని ప్రేమించు మిత్రమా అంటూ సాగే గీతా బోధనలు చిత్ర కథపై ఆసక్తిని పెంచాయి. మహాసేన్ విజువల్స్ బ్యానర్‌లో జ్యోత్స్న నిర్మిస్తున్న ‘కృష్ణలీల’ సినిమాలో సీనియర్ నటులు వినోద్ కుమార్, బబ్లూ ఫృథ్వీ, తులసిలతో పాటు సెవన్ ఆర్ట్స్ సరయు, రవి కాలే, ఆనంద్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
