Double Ismart| బూతుల‌తో డ‌బుల్ ఇస్మార్ట్ టీజర్.. ద‌ద్ద‌రిల్లిపోయేలా చేశాడుగా..!

Double Ismart| రామ్ పోతినేని కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత రామ్‌కి మ‌ళ్లీ అలాంటి హిట్ అంద‌లేదు. ఇప్పుడు పూ

  • Publish Date - May 15, 2024 / 11:00 AM IST

Double Ismart| రామ్ పోతినేని కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత రామ్‌కి మ‌ళ్లీ అలాంటి హిట్ అంద‌లేదు. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి డ‌బుల్ ఇస్మార్ట్ అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ రోజు రామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉంది. మరోసారి పూరి, రామ్ పోతినేని కాంబో మ్యాజిక్ రిపీట్ కానుందని అభిమానులు భావిస్తున్నారు.

టీజ‌ర్ చూస్తుంటే అంతా గ‌న్ సౌండ్స్, బూతులే వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, నాకు తెల్వకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ చెప్పే డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌ను శివుడి నేపథ్యంలో తీసిన‌ట్టు సినిమాని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోకు బ్రెయిన్‌లో చిప్ పెట్టగా, దాన్ని తీసుకునేందుకు సంజయ్ దత్ గ్యాంగ్ ట్రై చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఇందులో సంజయ్ దత్ స్టైలిష్‌గా కనిపించ‌డ‌మే కాకుండా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇందులో హీరోయిన్‌గా కావ్య థాపర్ న‌టించ‌నున్న‌ట్టు టీజ‌ర్ ద్వారా అర్ధమైంది.. అలాగే అలీ, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, షయాజీ షీండే, టెంపర్ శ్రీను, బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటి వీజే బని ఇందులో న‌టిస్తున్నట్టు అర్ధ‌మైంది. వీజే బని ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్ష‌క‌లుని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఆలీ డిఫ‌రెంట్ గెట‌ప్‌లో కనిపించి సంద‌డి చేశాడు. డ‌బుల్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో మ‌న‌కు కావ‌ల్సిన‌వి అన్నీ కూడా ఉంటాయ‌ని టీజ‌ర్‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

 

Latest News