Site icon vidhaatha

Devara | ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు ఎందుకంటే… స్పందించిన ఎన్టీఆర్

దేవర (Devara) ప్రి–రిలీజ్​ ఈవెంట్​ను రద్దు చేయాల్సివచ్చింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్‌ పాసులు పొందిన వారూ వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట(Fans stampeded) జరిగింది. ఈవెంట్‌ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు. మరో వైపు లోపల కార్యక్రమానికి వచ్చిన అతిథులు సైతం కూర్చునేందుకు వీలు లేకుండాపోయింది. పలువురు అభిమానులు ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నీచర్‌, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అభిమానులను అదుపు చేయడం అసాధ్యమని భావించడంతో పోలీసులు,  హోటల్‌ నిర్వాహకులు ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేయాలని నిర్ణయించారు.. అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత నాగవంశీ వెనుదిరిగి వెళ్లినట్టు తెలిసింది. హీరో ఎన్టీఆర్​ కూడా నిరాశతో వెనుదిరిగారు.

ఎన్టీఆర్‌  ( NTR)హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హెచ్​ఐసిసిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

 

Exit mobile version