Site icon vidhaatha

Getup Srinu| రోజా మాట‌ల‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పిన గెట‌ప్ శీను

Getup Srinu|  ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం మంచి రంజుమీద ఉంది. కూట‌మి వర్సెస్ వైసీపీ మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా క‌నిపిస్తుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. నాయకులే కాకుండా వారి మ‌ద్ద‌తు దారులు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవ‌ల రోజా.. ప‌వ‌న్‌కి స‌పోర్ట్ చేస్తున్న వారిపై విమ‌ర్శ‌లు గుప్పించింది. వాళ్లెంత‌, వాళ్ల ప్రాణ‌మెంత‌? వీరితో ఎవ‌రు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలి కాని, వీరి గురించి ఎందుకు? వాళ్లంతా చిన్న చిన్న పాత్ర‌లు చేసుకుంటూ బ‌తుకుతున్నారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేఖంగా మాట్లాడితే ఎక్క‌డ తొక్కేస్తారేమోన‌ని వారి భ‌యం. అందుకే ఆ కుటుంబానికి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నార‌ని రోజా విమ‌ర్శించింది.

అయితే ఓ లాజిక్ కూడా మాట్లాడిన మంత్రి రోజా మెగా ఫ్యామిలీ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్‌ చేసినప్పుడు ఎందుకు గెలవలేదని కూడా ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ‘రాజు యాదవ్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో గెటప్ శ్రీను స్పందించారు. మెగా ఫ్యామిలీతో మాత్రమే కాకుండా.. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతోనూ మేము సినిమాలు చేశాం. అంద‌రి హీరోల సినిమాల‌లో మాకు అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాకు అభిమానం ఉంది కాబ‌ట్టే జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాం. పిఠాపురంలో ప్రచారానికి మంచి స్పందన లభిస్తుంది. ఆయ‌న లక్ష మెజారిటీతో గెలవ‌డం ఖాయం అంటూ గెటప్ శ్రీను జోస్యం చెప్పారు. ఇక జనసేన నుంచి ఎవరూ తమని రమ్మని పిలవలేదని.. పవన్‌పై ఉన్న ఇష్టంతోనే ప్రచారానికి వెళ్లామ‌ని కూడా ఆయ‌న అన్నారు.

ఇక రోజా కామెంట్ల‌పై స్పందించిన గెట‌ప్ శీను.. . మేము చిన్నవాళ్లమని మేడమ్ అన్నారు. అలానే ఆవిడ కామెంట్లని కూడా మేము చిన్నగానే చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చాడు. ఇక గా ‘రాజు యాదవ్’ ట్రైలర్‌లో గెటప్ శ్రీను తనదైన నటనతో అద‌ర‌గొట్టేశాడు. ముఖ్యంగా అతడు కామెడీని, ఎమోషన్స్‌ను పండించడంలో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ చక్కగా కుదిరాయి. ఇక, ఇందులో చివర్లో గెటప్ శ్రీను రిచ్ మ్యాన్‌గా కారులో నుంచి దిగి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సినిమాపై భారీగానే అంచ‌నాలు పెంచాడు.

Exit mobile version