విధాత: మహావతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ రూ.220 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా యానిమేటెడ్ మూవీలలో కొత్త రికార్డు కలెక్షన్స్ క్రియేట్ చేసింది. గతంలో తెలుగులో ఇదే లక్ష్మినరసింహస్వామి-భక్త ప్రహ్లాద పురాణ కథతో టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే టైటిల్‌తో పౌరాణిక సినిమాకు ప్లాన్ చేశారు. ‘హిరణ్య కశ్యప’ టైటిల్ రోల్ కోసం దగ్గుబాటి రానాను ఎంపిక చేశారు. రానా కూడా ఆ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈలోపే కరోనా కారణంగా సినిమా పక్కనపడింది. అటు రానా కూడా అనారోగ్యానికి గురయ్యాడు.
కొంతకాలానికి హిరణ్య కశ్యప మూవీని అమర చిత్ర కథ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రకటించారు. రాక్షస రాజు హిరణ్య కశ్యప పాత్రలో రానా లుక్ తో పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాతా ఏమైందో ఏమోగాని గుణశేఖర్ నుంచి ‘హిరణ్య కశ్యప’ సినిమా నిర్మాణం గూర్చి కొత్త అప్డేట్ వెలువడలేదు. అసలు ఆయన ఈ సినిమా తీస్తున్నారా లేక విరమించుకున్నారా అన్న ప్రశ్నలపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఇంతలో యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా రూ.220కోట్ల వసూళ్లతో దూసుకెలుతుంది. లక్ష్మినరసింహస్వామి-భక్త ప్రహ్లాద పురాణ కథకు ఆధునిక హంగులు జోడించి నిర్మిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.
దీంతో పౌరాణిక సినిమాల పట్ల అభిరుచి ఉన్నదర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా తీసి ఉంటే..ఆర్థిక కష్టాల నుంచి బయటపడి ఉండేవారంటున్నారు సినీ విశ్లేషకులు. రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించిన గుణశేఖర్ కెరీర్ లో ‘హిరణ్య కశ్యప’ మంచి ఐకానిక్ గా మిగిలి ఉండేదన్న అభిప్రాయం వెలిబుచ్చారు.
ఇవి కూడా చదవండి…
పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ జలపాతాలు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు మాజీ క్రికెటర్ సురేష్ రైనా