Betting Apps | విధాత: బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను(Suresh Raina) ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన సురేశ్ రైనా.. అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాజీ క్రికెటర్‌ను విచారించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. రైనా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించింది. అక్రమ బెట్టింగ్ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయని ఈడీ గుర్తించింది. ఈ యాప్‌లను ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలపై ఈడీ తన దృష్టిని సారించింది. ఇప్పటికే, పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, క్రికెటర్లను ఈ కేసులో ఈడీ విచారించింది. ఇటీవల, నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి(Manchu Lakshmi ) వంటి ప్రముఖులను కూడా తెలంగాణ పోలీసులు, ఈడీ విచారణకు పిలిచారు.
ఇవి కూడా చదవండి…
`కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో ఆపరేషన్ సిందూర్ మహిళా ఆర్మీ అధికారులు!