Site icon vidhaatha

వామ్మో… #RC16 స్క్రిప్ట్ ​పనులకే అన్ని కోట్లా..? ఓ సినిమా తీయొచ్చు

రామ్​చరణ్​, బుచ్చిబాబుల ఆర్​సీ16(#RC16) త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే పాన్​–ఇండియా సినిమాగా, సరికొత్త కథతో ఉండబోతోందని విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్న ఈ చిత్రం మరో రికార్డును కూడా షూటింగ్​ మొదలవడానికి ముందే సృష్టించింది. కథ తాలూకు స్క్రిప్ట్​ పను(Script Work)ల కోసం, మరిన్ని మెరుగులు దిద్దడం కోసం ప్రముఖ రచయిత(Veteran Writers)లను రంగంలోకి దింపాడు. స్క్రిప్ట్​ పనుల కోసమే ఓ ఆఫీసు కూడా ఓపన్​ చేసిన బుచ్చిబాబు వీటన్నింటికీ కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయలు.. వీరు విన్నది నిజమే. స్క్రిప్ట్​ పనులకే 3 కోట్లు( Rs. 3 Crores for Script works) ఖర్చు పెడుతున్నాడట. ఇప్పటి వరకు తెలుగు చిత్ర సీమలో స్క్రిప్ట్​కు ప్రత్యేకంగా ఖర్చుపెట్టడం ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. మూడు కోట్లంటే బలగం లాంటి సినిమా అవలీలగా తీసేయొచ్చు. ఈ విధంగా స్క్రిప్ట్​కు కూడా ప్రత్యేక బడ్జెట్​ను కేటాయించి ఆర్​సీ16 ఓ సరికొత్త రికార్డును తనపేర లిఖించుకుంది. First of its kind.

ఉప్పెన(Uppena).. దిగ్దర్శకుడు సుకుమార్(Sukumar) పరిచయం చేసిన తన​ ప్రియ శిష్యుడు సానా బుచ్చిబాబు(Buchibabu Sana) దర్శకత్వం వహించిన మొదటి సినిమా. ఊహించని విజయం అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా బుచ్చిబాబు స్క్రిప్ట్​ను డీల్​ చేసిన విధానం పెద్ద పెద్ద దర్శకులను, హీరోలను ఆలోచనలో పడేసింది. అందులో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కూడా ఉన్నారు. ఇంతలో తన రెండో కథను సిద్ధం చేసుకున్న బుచ్చిబాబు, దాన్ని ఎన్టీఆర్(Jr.NTR)​తో తీయాలనుకుని చాలా నెలలు వేచిచూసాడు. కానీ, ఎన్టీఆర్​ కమిట్​మెంట్ దేవరతో ఉండటంతో, ఆయన సలహాపై రామ్​చరణ్​ను సంప్రదించాడు. అప్పటికే ఎన్టీఆర్​ నుండి కాల్​ అందుకున్న చరణ్​, ఆ మట్టి కథకు బాగా ఇంప్రెస్​ అయ్యాడు. ఒక గ్రామీణ క్రీడాకారుడి జీవిత చరిత్ర(Rural Sports Drama)గా చెప్పబడుతున్న ఈ చిత్రానికి రామ్​చరణ్(Ramcharan)​ పచ్చజెండా ఊపాడు. మెగాస్టార్​ చిరంజీవి కూడా కథను ఎంతగానో ప్రశంసించాడు. దాంతో ఈ సినిమా ఖాయమైంది. మైత్రీ మూమీ మేకర్స్​,  సుకుమార్​ రైటింగ్స్​,  వృద్ధి సినిమాస్​ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాయి. సంగీత దర్శకుడిగా ప్రపంచ ప్రసిద్ధ ఏఆర్​ రహమాన్(AR Rehaman)​ను ఎంచుకున్నారు. బుచ్చిబాబు కథ రహమాన్​ను బాగా కదిలించింది. ఆయనా బండెక్కేసారు. ఇక హీరోయిన్​. హ్యాపెనింగ్​ హీరోయిన్​గా దేశంలో బాగా నానుతున్న పేరైన జాన్వీకపూర్(Janhvi Kapoor)​ను ఖరారు చేసారు. జగదేకవీరుడి కొడుకుకి, అతిలోక సుందరి కూతురు జతగా మారింది. దీంతో ఒక్కసారిగా ఆర్​సీ16 రేంజ్​ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే ఆర్​ఆర్​ఆర్​తో గ్లోబల్​ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్న రామ్​చరణ్​కు ఇది మరో ప్రయోగాత్మక చిత్రం. రంగస్థలం(Rangasthalam)తో మట్టి కథలను కూడా  తన నటనతో బంగారంగా మార్చగలిగే స్థాయికి చేరుకున్న చరణ్​ దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నాడు కూడా.

పాన్​ ఇండియా సినిమాగా రెండో సినిమానే పేరు తెచ్చుకోవడంతో బుచ్చిబాబు స్క్రిప్ట్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందునా పెద్ద హీరోతో మొదటి సినిమా. ఎటువంటి రిస్కూ తీసుకోదలుచుకోలేదు. అందులో  భాగంగానే  ప్రముఖ రచయితలను స్క్రిప్ట్​పనుల్లోకి దింపాడు. సుకుమార్​ రైటింగ్​ డిపార్ట్​మెంట్​ ఎలాగూ ఉండనేఉంది. ఈ రచయితలు స్క్రిప్ట్​ను పరిశీలించి అవసరమైన, సూచనలు, సలహాలు ఇవ్వడం, వాటిని అమలు చేసిన తర్వాత మళ్లీ చెక్​ చేసి బాగుంటే ఓకే అనడం, లేకపోతే మరో వర్షన్​ తయారుచేయడం జరుగుతోంది. ఆఖరికి ఎలాగూ సుకుమార్​ చూసి, స్టాంప్​ వేసి సంతకం పెట్టాలనుకోండి.

అదీ విషయం.. ఏఆర్​ రహమాన్​, రత్నవేలు(Ratnavelu) లాంటి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు, తమిళ, కన్నడ చిత్రసీమ నుండి విజయ్​ సేతుపతి(Vijay Sethupathi), శివ​ రాజ్​కుమార్​(Siva Rajkumar) లాంటి మహానటులు, జాన్వీకపూర్​ కథానాయికగా పనిచేయబోతున్న ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. అందుకే స్క్రిప్ట్​ వర్క్​కు కూడా బడ్జెట్​ కావాలనగానే, కథ మీద నమ్మకంతో మూడు కోట్లు కేటాయించేసారట.

 

Exit mobile version