Trisha| ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకున్న తర్వాత చాలా జంటలు విడాకుల బాట పట్టారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తన భార్యకి విడాకులు ఇచ్చి త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడని నెట్టింట ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సింగర్ సుచిత్ర చెప్పుకొచ్చింది.
విజయ్ ఇటీవల తన 50వ పుట్టిన రోజు జరుపుకోగా, ఆ సమయంలో త్రిష కూడా మెరిసింది. ఇక పార్టీలో వారిద్దరు కలిసి దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆ సమయంలోనే వారిద్దరూ లిఫ్ట్‌లో దిగిన ఫోటో రచ్చలేపుతుంది. దీనిపై సుచిత్ర స్పందిస్తూ.. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి.. త్రిషను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కొన్నేళ్లుగా విజయ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు అని స్పష్టం చేసింది. గతంలో ఎంజీఆర్, జయలలిత మాదిరగా.. విజయ్, త్రిష బంధం ఉండబోతుందని ఆమె చెప్పుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంగీతతో విజయ్‌కి ఉన్న విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల పెద్దగా అయ్యాయంటూ సుచిత్ర స్టన్నింగ్ కామెంట్స్ చేసింది.
వారిద్దరి మధ్య చీకటి బంధానికి ఈ ఫొటోతో అధికారికంగా గుర్తింపు లభించింది అంటూ సుచిత్ర ఆరోపణలు చేసింది.అయితే దీనిపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రాజకీయాలలోకి వచ్చాడు కాబట్టి అతని ప్రతిష్టని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 2026 ఎలక్షన్స్ లో విజయ్ తమిళనాట పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. అయితే రాజకియాల్లో ఉన్న విజయ్ కి త్రిష సపోర్టివ్‌గా ఉంటుందని అంటున్నారు