Kantara Chapter 1 | విధాత: కన్నడ నటుడు రిషభ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1’(Kantara Chapter 1) సినిమాకు మేకర్స్ ప్రమోషన్ ప్రారంభించారు. 2022లో విడుదలైన బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఆక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కాంతార చాప్టర్ -1’ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో నటిస్తున్న కథానాయిక రుక్మిణి వసంత్‌ని(Rukmini Vasanth) పరిచయం పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. కనకవతి(Kanakavathi) ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రుక్మిణి వసంత్ ఈ మూవీలో కనకవతి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌లో రుక్మిణి రాజసమైన లుక్ రివీల్ చూస్తే సినిమాలో ఆమె పాత్ర రాచరిక నేపథ్యంలో ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. ‘కాంతార’ కథకు ముందు ఏం జరిగిందనే అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బనవాసిని పాలించిన కదంబుల సామ్రాజ్యం కాలం నాటి కథాంశంతో, ఆ కాలంలోని సంస్కృతి, సంప్రదాయాలను సినిమాలో చూపించబోతున్నారు. ఆనాటి భూతకోల ఆచారం వెనుక ఉన్న పురాణగాథను ఈ ప్రీక్వెల్‌లో ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తుంది.
హొంబాలే ఫిల్స్మ్(Hombale Films) పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ‘కాంతార చాప్టర్ -1’ లో రిషభ్ శెట్టి అతీతశక్తులు కలిగిన నాగ సాధువు పాత్రలో కనిపించనుండటం విశేషం. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార చాప్టర్ -1’ విడుదల కాబోతుంది.