Ravi Teja| మాస్ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా సక్సెస్‌కి దూరంగా ఉన్నాడు. ఆయన నుండి హిట్ రాక చాలా రోజులైంది. రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు.ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మిస్టర్ బచ్చన్ తర్వాత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ ఓ సినిమా చేస్తోన్నాడు. రవితేజ కెరీర్‌లో 75వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. రవితేజ తన 75వ సినిమా షూట్‌లో చిన్న ప్రమాదం చోటు చేసుకోవడంతో రవితేజ కుడిచేతి కండరాలు చిట్టినట్లుగా తెలుస్తోంది.
అయితే అంత గాయపడిన సరే లెక్క చేయకుండా రవితేజ షూట్‌లో పాల్గొనడంతో.. గాయం మరింత ఎక్కువ అయిందట.. వెంటనే ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో జాయిన్ అయ్యారు. గురువారం యశోద హాస్పిటల్ డాక్టర్లు రవితేజకు సర్జరీని నిర్వహించినట్లు తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు తెలియగా, గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటివరకు రవితేజ షూటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. నెలకు పైనే రవితేజ్ ఇంట్లో రెస్ట్ తీసుకోబోతున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ ను చేంజ్ చేయబోతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజ్. గెలుపోటములు లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు రవితేజ
అయితే రవితేజకి సంబంధంచిన పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో ఇది చూసి అందరు అవాక్కవుతున్నారు. ఒంటి నిండా ఆ రక్తం ఏంటి, ఆ కట్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు.రవితేజ తొందరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. కాగా, రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్ అంటూ ఇలా వరుస సినిమాలతో ఇటీవల పలకరించిన రవితేజ ఏ సినిమా కూడా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయాడు. అయిన కూడా వాటిని పట్టించుకోకుండా.. తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. 60 ఏళ్ళకు అతి దగ్గరలో ఉన్న రవితేజ..ఇప్పటికీ అదే జోష్ తో.. అదేఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. టాలీవుడ్ లో సందడి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రవితేజకి సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుండగా, అది టచ్ చేసి చూడు మూవీలోని సీన్‌కి సంబంధించిన పిక్ అని అది ఫేక్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.