Site icon vidhaatha

Police Station Mein Bhoot : రామ్ గోపాల్ వర్మ ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ మూవీ నుంచి పోస్టర్

Police Station Mein Bhoot

Police Station Mein Bhoot | విధాత : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma), నటుడు మనోజ్ బాజ్‌పేయి(Manoj Bajpayee) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పోలీస్ స్టేషన్ మే భూత్'(Police Station Mein Bhoot) అనే హారర్-కామెడీ చిత్రం తెరకెక్కుతుంది. ఊహించని మలుపులుతో సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగే ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమాకు సంబంధించి రాంగోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ ను, గ్లింపును అప్డేట్ గా వదిలారు. మనోజ్ బాజ్ పేయ్ పోలీస్ ఆత్మ ఆకారంలో..చేతిలో ఓ చిన్నారి ఆత్మ ఆకారంతో భయపెట్టేలా పోస్టర్, గ్లింపు వీడియో రూపొందించి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. “సత్య, కౌన్, షూల్ చిత్రాల తర్వాత మనోజ్ బాజ్ పేయ్, వర్మల కలయికలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా రాబోతుంది.

మీరు డెడ్‌ను చంపలేరు ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో జెనిలియా డిసౌజా(Genelia D’Souza) ఇందులో మరో కీలక పాత్రలో అలరించనున్నారు. పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఓ గ్యాంగ్‌స్టర్‌ ఆత్మగా తనను చంపిన పోలీస్ స్టేషన్ లోని పోలీసులను వెంటాడేందుకు దెయ్యంలా తిరిగి వస్తాడు. అందుకే “పోలీస్ స్టేషన్ నాది భూతం” అనే టైటిల్ పెట్టామని.. చనిపోయిన వారిని మీరు అరెస్టు చేయలేరని ట్యాగ్ లైన్ గా పెట్టామని వర్మ ఎక్స్ లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లోని పోలీసులు అంతా గ్యాంగ్‌స్టర్ల దయ్యాల నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో హారర్ కామెడీ(Horror Comedy) సన్నివేశాలతో సినిమా సాగనుందని వెల్లడించారు.

Exit mobile version