Site icon vidhaatha

Nagarjuna|కాబోయే కోడ‌లిని చిరంజీవికి ప‌రిచ‌యం చేసిన నాగార్జున‌.. చేతిలో చేయి వేసి..!

Nagarjuna|గ‌త రాత్రి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుక అట్టహాసంగా అన్నపూర్ణ స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో పాటు బాలీవుడ్ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా హాజ‌రై సంద‌డి చేశారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ ఈవెంట్‌లో సంద‌డి చేశారు. ఈవెంట్ లో అక్కినేని ఫ్యామిలీకి కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా హాజరైంది. నాగచైతన్యతో కలిసి వచ్చిన శోభిత ఈ ఈవెంట్లో హైలెట్ గా నిలిచింది. అందరి కళ్ళు కాబోయే జంటపైనే ఉన్నాయి. ఇక నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు.

ఈ క్రమంలో నాగార్జున చిరంజీవిని పిలిచి మరీ శోభితను పరిచయం చేసారు. చిరంజీవి శోభిత(Sobhita)తో మాట్లాడారు. పక్కనే నాగ చైతన్య కూడా ఉన్నాడు. నాగార్జున చిరంజీవికి తనకు కాబోయే కోడలు శోభితను పరిచయం చేస్తున్న పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి..శోభిత చేతులు ప‌ట్టుకొని మాట్లాడ‌గా,ఆయ‌న కూడా శోభిత‌ని యాక్సెప్ట్ చేశార‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఈవెంట్‌లో చివరిగా అమితాబచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్‌కి ఏఎన్ఆర్ జాతీయ అవార్డును సైతం ఇవ్వడం జరిగింది. ఈ క్షణాన్ని సైతం చిరంజీవి ఎంతో గొప్ప అనుభూతిని కలిగించింది అంటూ తెలియజేశారు. మొత్తానికి తన పెద్ద కోడలు శోభిత ధూళిపాళ్ళ నాగార్జున స్వయంగా పరిచయం చేయడంతో అందరూ సంబరపడిపోతున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ అందుకోవడం సంతృప్తిని ఇచ్చిందని తెలియ‌జేశారు. తన గురువు అమితాబ్(Amitabh Bachchan) చేతుల మీదుగా అందుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు. అవార్డు అందుకున్న సమయంలో అమితాబ్ పాదాలకు నమస్కారం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version