Telangana HC On OG Movie Ticket Price | పవన్ ఓజీ మూవీ బృందానికి హైకోర్టు ఊరట

ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుకు హైకోర్టు ఒకరోజు ఊరట ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ ₹100, మల్టీఫ్లెక్స్ ₹150, ప్రీమియర్ ₹800.

pawan-kalyan-og-movie-team-gets-temporary-relief-from-high-court-on-ticket-prices

విధాత, హైదరాబాద్ : సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఓజీ సినిమా యూనిట్ కు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బుధవారం ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి వి.శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం వరకు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

ఓజీ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరలతో పాటు ఈ నెల 25నుంచి ఆక్టోబర్ 8వరకు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ లో రూ.100, మల్టీఫ్లెక్స్ లో 150, ప్రిమియర్ షో కు రూ.800గా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. దీనిపై బర్ల మల్లేష్ వేసిన పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ కేసు విచారణను ఆక్టోబర్ 9కి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై చిత్ర బృందం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో ఒకరోజు ఊరట లభించింది.