Site icon vidhaatha

Rakul Preet Singh| ర‌కుల్ బ్యాడ్ సెంటిమెంట్.. ఆమె ఉంటే మూవీ ఫ్లాప్ అయిన‌ట్టే..!

Rakul Preet Singh| ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌ల‌లో ఒక‌రిగా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఆమెని ప‌ట్టించుకునే ద‌ర్శ‌కులే క‌రువ‌య్యారు.కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటిస్తున్న‌ప్ప‌టికీ అక్కడ ఆమెకు సరైన హిట్ రావ‌డం లేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు సన్న‌గిల్లిపోయాయి. మ‌రోవైపు రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది అని చెప్పాలి. రకుల్ చివరగా తెలుగులో కొండపొలం అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం త‌ర్వాత ఆమె మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది లేదు.

అయితే రీసెంట్‌గా భార‌తీయుడు2తో చిత్రం టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా శంకర్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇండియన్ 2లో రకుల్ నిడివి చూస్తే అవాక్క‌వ్వాల్సిందే. హీరోయిన్ అన్నది పేరు కోసమే తప్పా.. స్క్రీన్‌పై రకుల్ కనిపించింది కేవ‌లం మూడు, నాలుగు సీన్లు మాత్ర‌మే. అయితే ఇండియ‌న్ 2 సినిమా దారుణ‌మైన ఫ్లాప్ కావ‌డంతో ఆమెపై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. కొందరు నెటిజన్లు రకుల్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. కొంద‌రు నెటిజ‌న్స్ కొత్త వాదనని తెరపైకి తీసుకువస్తున్నారు.

సీక్వెల్స్ చిత్రాల్లో రకుల్ నటిస్తే ఆ మూవీ ఫ్లాపే అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రకుల్ నటించిన ప్రతి సీక్వెల్ చిత్రం డిజాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. రకుల్ నటించిన కిక్ 2, మన్మథుడు 2, భారతీయుడు 2 ఇలా ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్ట‌డంతో ర‌కుల్ న‌టించిన ఏ సీక్వెల్ చిత్రం అయిన ఫ్లాప్ ప‌క్కా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే… జాకీ భగ్నానీ అనే వ్యక్తితో ప్రేమాయ‌ణం సాగించిన ఈ అమ్మడు రెండేళ్ల‌పాటు అత‌నితో డేటింగ్‌లో ఉంది. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది.

Exit mobile version