Site icon vidhaatha

SALAR|నేడే స‌లార్ టీవీ ప్రీమియ‌ర్.. పాత రికార్డులన్నింటిని చెరిపేస్తుందా?

SALAR| ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ స‌లార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ గతేడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ప్ర‌భాస్‌కి ఈ మూవీ కాస్త బూస్ట్ ఇచ్చింద‌ని చెప్పాలి. ఇక ఈ మూవీ ఓటీటీలో కూడా విడుద‌లై మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇప్పుడు టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అయ్యేందుకు సిద్ధంగా ఉంది . ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సలార్ చిత్రాన్ని స్టార్ మా లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్రోమో ద్వారా తెలియ‌జేశారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈమూవీ రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది.

స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. ఇప్పుడు ఇది ఎంత టీఆర్పీ సంపాదిస్తుంద‌నేది ఆస‌క్తిక‌కరంగా మారింది. తెలుగు మూవీస్ లో ఇప్పటివరకు అత్యధిక టిఆర్పి అందుకున్న సినిమాగా అలవైకుంఠపురములో 29.4 రేటింగ్ తో టాప్ స్థానంలో ఉండ‌గా, ఈ రికార్డ్‌ని ప్ర‌భాస్ బ్రేక్ చేస్తాడా లేదా అని ప్ర‌తి ఒక్క‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. మ‌రి కొద్ది గంటల‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు చేసిన సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఈ ఏడాది జనవరిలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స‌లార్ అడుగుపెట్టింది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‍కు రాగా, హిందీలో మాత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీల్లో గ్లోబల్ రేంజ్‍లో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స‌లార్‌కి థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఆయ‌న త‌దుప‌రి సినిమాల‌పై కూడా చాలా ఆస‌క్తి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ చేస్తుండ‌గా, మే 9న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కాని ఎల‌క్ష‌న్స్ వ‌ల‌న వాయిదా వేశారు. జూన్ త‌ర్వాత రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం కూడా ప్రభాస్ చేయనున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‍లో స్పిరిట్ మూవీకి కూడా ఓకే చెప్పారు. సలార్ 2 కూడా చేయనున్నారు. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ కూడా క‌న్‌ఫాం అయింది.

Exit mobile version