- లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబానికి
- చెందిన ఎనిమిది మంది దుర్మరణం
- ప్రాణాలతో బయటపడ్డ 3 నెలల శిశువు
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. కారు లారీని బలంగా ఢీకొనడంతో డ్రైవర్ సహా ఒకే కుటుంబానికి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మూడు నెలల శిశువు ప్రాణాలతో బయటపడింది. లారీని కారు బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగంగా తుక్కుతుక్కు అయింది.
వారణాసి-లక్నో హైవేపై బెనారస్ నుంచి పిలిభిత్ వైపు వెళ్తున్న కారు ట్రక్కును తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది మృతి చెందారు. మూడేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం చిన్నారి దవాఖానలో చికిత్స పొందుతున్నది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వారణాసి రోడ్డు ప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపారు.గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.