విధాత: మొయినాబాద్ jbit కాలేజీలో బీటెక్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకు న్నాడు. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా విజయ్ మృతి పై తోటి విద్యార్థులు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ దొరికినా ఏమి రాసాడో తెలియకుండా కాలేజీ యాజమన్యం దాస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
గతంలోను ఫీజ్ కి సంబంధించి యాజమాన్యం వేధింపులకు గురి చేసిందని విద్యార్థులు తెలిపారు. కాగా 10 రోజుల క్రితమే విజయ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కాలేజ్ యాజమాన్యం దాస్తోందని విజయ్ కుటుం బానికి న్యాయం జరగాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ కొందరు విద్యార్థులు కాలేజీ యాజమ న్యం ఒత్తిడి వలన చనిపోయారన్నారు.
ఇదిలాఉండగా రాంజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ మాట్లాడుతూ విజయ్ భాస్కర్ అనే విద్యార్థి ఉదయం 9 30 గంటలకు చనిపోయాడ నే సమాచారం వచ్చిందన్నారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాలిసి ఉందని.. సూసైడ్ చేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదన్నారు. గతంలో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదని విజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్నీ ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు