
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం . మద్యానికి బానిసైన భర్తను నరికి చంపిందో భార్య. జిల్లాలోని మహాముత్తారం మండలం కొరకుంటలో భర్త ఇనుముల కిష్టయ్య తరచు తాగివచ్చి తన భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా భార్యా భర్తల మధ్య ఘర్షణ జరగడంతో విసిగిపోయిన భార్య అతన్ని నరికి చంపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.