విధాత : కొత్త ఏడాది 2026లో వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాల తేదీలు ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పండితులు కొత్త ఏడాదిలో వివాహాల శుభ ముహూర్తాల తేదీలు ఖరారు చేశారు. 2025 నవంబర్ 26వ తేదీ నుంచి శుక్ర మౌడ్యమి (గురుడు, శుక్రుడు అస్తంగత్వం) ప్రారంభమై 2026 ఫిబ్రవరి 17వరకు కొనసాగుతుంది. ఈ మూఢాల సమయంలో శుభ కార్యాలు చేయకపోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రస్తుతం 2025 డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైన ధనుర్మాసం 2026 జనవరి 15వ తేదీన సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో (మకర సంక్రాంతి 2026) ముగుస్తుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. చాతుర్మాస్యం వలన 2026 ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్ నెలల్లో శుభ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాదిలో పెళ్లిళ్లకు శుభా ముహూర్తాల తేదీలు
పండితులు తెలిపిన వివరాల మేరక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24,25, 26 తేదీలు పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలుగా ఉన్నాయి. మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు, ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు వివాహాలకు అనువైనవి.
ఇక మే నెలలో 1, 3, 5, 6, 7, 13,14 తేదీలు.. జూన్ లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీలు..జూలై నెలలో 1, 6, 7,11 తేదీలు పెళ్లిళ్లలకు అనుకూలం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాతుర్మాస్యం కారణంగా శుభ ముహూర్తాలు ఉండవు.
తిరిగి నవంబర్ నెలలో 21, 24, 25, 26 తేదీలు పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ మాసంలో 2, 3, 4, 5, 6,11,12 తేదీలు వివాహ ముహూర్తాలకు అనువుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
New Year Celebrations : న్యూ ఇయర్ పార్టీలా…ఈగల్ చూస్తుంది జాగ్రత!
Fire Accident : పెట్రోల్ బంక్ లోకి మంటలతో వ్యాన్..తప్పిన భారీ ప్రమాదం
