Zodiac Signs | గ్రహాల మార్పుతో పాటు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి గ్రహాలు ప్రవేశించడం కారణంగా పలు రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావం చూపిస్తుంటుంది. అయితే జనవరి 16వ తేదీన మకర రాశిలోకి సూర్యుడు, శుక్రుడు, కుజుడు ప్రవేశించడంతో అరుదైన త్రిగ్రాహి యోగం( Trigrahi Yogam ) ఏర్పడనుంది. ఇలాంటి కలయిక దాదాపు 200 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీంతో ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి స్వర్ణయుగం ప్రారంభం కానుందని చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జనవరి 13న శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. మకర రాశిలో శుక్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతోంది. ఈ అరుదైన త్రిగ్రాహి యోగం 200 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీంతో ఈ నాలుగు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం అవుతుంది.
వృషభ రాశి (Taurus)
త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి సానుకూల మార్పులను తెస్తుంది. వృత్తి జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. కేరీర్‌లో గొప్పగా రాణిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి కాసుల వర్షం కురియనుంది. అప్పులన్నీ తీర్చేసి.. సుఖమైన జీవితాన్ని గడుపుతారు. ఇన్నాళ్లు వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. మొత్తానికి ఈ సంక్రాంతి తర్వాత సంపద, అదృష్టం తలుపు తట్టనుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని తెస్తుంది. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడుతాయి. లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలను పొందుతారు. విదేశాలకు ప్రయత్నించే వారు తప్పకుండా వెళ్తారు. అవివాహితులకు అడ్డంకులు తొలగిపోయి ఓ ఇంటి వారవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి (Sagittarius)
ధనస్సు వారికి త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ శుభ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర రాశి (Capricorn)
త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు దొరుకుతాయి. వారికి కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వారికి పిల్లల గురించి శుభవార్త వింటారు.
