Astrology | నవంబర్ 3 నుంచి శుక్రుడు( Venus ) తన స్వస్థానమైన తులా రాశి( Libra )లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా ప్రేమ పెళ్లిళ్లు( Love Marriages ), దాంపత్య జీవితాల్లో అద్భుతమైన అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గురువు( Jupiter ) ఉచ్ఛ స్థితిలో ఉండడం కూడా ఈ ఆరు రాశుల( Zodiac Signs ) వారికి కార్తీక మాసం( Karthika Masam ) మొత్తం కలిసి వస్తుందట.గురువు శుభ కార్యాలకు, శుక్రుడు ప్రేమలు, పెళ్లిళ్లకు కారకులైనందు వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా ప్రేమ పెళ్లిళ్ల విషయాల్లో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది అని పండితులు పేర్కొంటున్నారు.
మేష రాశి( Aries )
మేష రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో గురువు సంచారం కారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం కుదిరే అవకాశం ఉంది. లేదా సంపన్నుడితో ప్రేమలో పడే అవకాశం ఉంది. గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది.
మిథున రాశి( Gemini )
మిథున రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం కారణంగా వివాహ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో వివాహం నిశ్చయం అవుతుంది. ప్రేమ పెళ్లిళ్లలో విజయం సాధిస్తారు. దాంపత్య సమస్యలు పూర్తిగా పరిష్కారమై అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.
కర్కాటక రాశి( Cancer )
కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛపట్టడం, చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాల స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి, గృహ ప్రవేశం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి ఖాయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయం సాధిస్తారు. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి.
కన్య రాశి( Virgo )
కుటుంబ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా కుటుంబం ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఇష్ట మైన వ్యక్తితో లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. గృహ ప్రవేశం చేసే యోగం కూడా కలుగుతుంది.
ధనుస్సు రాశి ( Sagittarius )
శుక్రుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. శుభ కార్యాలకు కారకుడైన గురువు అష్టమ స్థానంలో, అంటే మాంగల్య స్థానంలో ప్రవేశించడం వల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది.
మకర రాశి ( Capricorn )
ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు, దశమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల కుటుంబంలో కొన్ని ముఖ్యమైన శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలతో పాటు గృహ, వాహన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి. సహోద్యోగితో కానీ, ప్రేమించిన వ్యక్తితోగానీ పెళ్లయ్యే అవకాశం ఉంది.
