LPG Gas Saving Tips | ఎల్‌పీజీ సంక్షోభం.. మీ గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఆదా చేయొచ్చు!

LPG Gas Saving Tips | మీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా? వంట చేసేప్పుడు సింపుల్ టిప్స్ పాటిస్తే ఎల్‌పీజీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ సమయంలో బరువు చెక్ చేస్తే మోసాలను తగ్గించుకోవచ్చు.

lpg-gas-saving-tips

LPG Gas Saving Tips | భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ( LPG Gas Crisis ) ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాణిజ్య సిలిండర్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, ముంబై, బెంగళూరు సహా దేశంలోని పలు నగరాల్లో హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. తొందరలోనే గృహ వినియోగ వంట గ్యాస్ ( Cooking Gas ) విషయంలో కూడా కొరత వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మన ఇంట్లో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? సిలిండర్ డెలివరీ సమయంలో జరిగే మోసాలను ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

డెలివరీ సమయంలో ఇలా చెక్ చేసుకోండి

ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ తక్కువగా ఉందనే ఆరోపణలు చాలా వినిపిస్తుంటాయి. అయినప్పటికీ సిలిండర్ డెలివరీ సమయంలో చాలామందిని పట్టించుకోరు. సీల్ ఒక్కటి సరిగ్గా ఉందో లేదో చూసి వదిలేస్తారు. కానీ వాస్తవానికి సిలిండర్ తీసుకునేప్పుడు బరువు సరిగ్గా ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచింది.

ఎల్‌పీజీ సీలిండర్ బరువు ఎంత ఉండాలంటే

మొత్తం బరువు 29.7కిలోలు
గ్యాస్ బరువు 14.2 కిలోలు
ఖాళీ సిలిండర్ బరువు 15.5 కిలోలు

మనం సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో ఈ బరువు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ తూకం వేసుకోవడానికి పెద్ద పెద్ద యంత్రాలు ఏమీ అక్కర్లేదు. ప్రయాస కూడా పడాల్సిన అవసరం లేదు. కేవలం రూ.300 లోపు లభించే హుక్ టైప్ వెయింగ్ మెషిన్‌తో మనమే స్వయంగా బరువు చెక్ చేసుకోవచ్చు.

వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టిప్స్ పాటించండి

Read More :

Hyderabad Hotels | వంట గ్యాస్ కొర‌త‌.. మ‌రో 48 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో హోట‌ల్స్ బంద్..!

Latest News