Diwali | ఈ నెల 20వ తేదీన సోమవారం నాడు దీపావళి( Diwali ) పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ సిద్ధమైపోయారు. ఇంటిని శుభ్రపరుచుకుని, దీపాలతో అందంగా అలంకరణ చేయనున్నారు. దీపాల అలంకరణతో పాటు లక్ష్మీదేవి( Lakshmi Devi )కి కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే లక్ష్మీదేవి పూజా( Lakshmi Puja ) సమయంలో భక్తులు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా పూజ సమయంలో ధరించే దుస్తుల( New Clothes ) విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. కేవలం మూడు రంగు దుస్తులు ధరించి మాత్రమే పూజలో పాల్గొనాలని చెబుతున్నారు. మరి ఆ రంగు వస్త్రాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏయే రంగు వస్త్రాలు ధరించాలంటే..?
దీపావళి వేళ ప్రతి మహిళ తమ నివాసంలో లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. ఈ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. పసుపు రంగు అనేది బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. అందువలన శాంతి, సంపదకు ప్రతీక అయిన పసుపు రంగు దుస్తులు ధరించి, పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంట.
అదే విధంగా దీపావళి సమయంలో లక్ష్మీ పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతి రూపమైనది, ఇది కుజ గ్రహంతో సంబంధం ఉంటుంది. అందువలన దీపావళి సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన కూడా ధనప్రాప్తి కలుగుతుందంట.
తెలుపు రంగు దుస్తులు శాంతికి ప్రతీకం. అయితే దీపావళి పండుగ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేయడం మంచిదంట. తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు పండితులు.
ఈ రెండు రంగులు ధరించకూడదట..!
ఇక దీపావళి పండగ రోజున లక్ష్మీ పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు దుస్తులను ధరించకూడదంట. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన పాజిటివ్ వైబ్స్ తగ్గడమే కాకుండా, ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయంట.
అదే విధంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే నలుపు అనేది శని దేవుడికి సంబంధించినది, ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం అశుభకరం, దీని వలన మానసిక ఒత్తిడి, నిరాశ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.