దశ మహావిద్యాదేవీ శక్తులలో 8వ శక్తి గా బగళాముఖీ దేవి ఈ లోకంలో దర్శనమిస్తున్నది.
విధాత:దుష్ట దానవుని సంహరిస్తున్న రూపంలోనే యీ దేవిని పూజించడం ఆచారంగా వస్తున్నది. దుష్టశక్తులను అణిచివేసే దేవతామూర్తులను పూజించినప్పుడు మనలో వున్న దానవత్వం తొలగిపోవడమేకాక మన చుట్టూ వున్న చెడు కూడా నశించిపోతుంది.దానవులు దేవతలను నాశనం చేయడానికి పాతిపెట్టి వెళ్ళిన వస్తువులను ‘ కృత్యా’ అని అంటారు. ఆ వస్తువులను నాశనం చేసే శక్తిని.
‘ వల్కాహనమ్’ అని పేరు.
‘వల్’కా అనే పదము
‘ బల్క’ గా మారి క్రమేణా
‘ బగళా’ అని అయినది.
దానికి ముఖి అనే మాటని చేర్చి బగళాముఖీ గా సంబోధిస్తున్నారు. చెడు శక్తులను నాశనం చేసే శక్తిమాతగా బగళాముఖీ దేవి ఆరాధించబడుతున్నది.
అధర్వణవేదంలో బగళాసూక్తం,యజుర్వేదంలో ఆభిసారిక ప్రకరణం, మొదలైనవాటిలో యీ దేవి తత్వం ఉన్నతంగా కీర్తించబడినది.’ బగళా’ అంటే వాక్బలన్నిచ్చే దేవి అని చెప్పబడుతున్నది.ఈ పరాశక్తి శ్రీ మన్నారాయణునికి, పరమేశ్వరునికి తగు సహాయం చేసినదని పురాణాలు వివరిస్తున్నాయి.
ఈదేవి సజ్జనులకి విజయాలు చేకూరుస్తుంది.దుష్టశక్తుల నుండి మనలను కాపాడే ఈ బగళాముఖి శక్తిని పసుపు రంగు పువ్వులతో పూజిస్తే కార్యసిధ్ధి లభిస్తుంది.బగళాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా లోయలలో వున్నది.’ఓం బగళాముఖీ యై నమః’