Zodiac Signs | ఆత్మగౌరవం( Self Respect ).. వ్యక్తిత్వానికి హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. ఒక వేళ ఆత్మగౌరవానికి భంగం కలిగితే.. కోపావేశాలతో ఊగిపోతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో ముందు ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆత్మగౌరవాన్ని అమితంగా గౌరవించే ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం..
సింహ రాశి( Leo )
సింహ రాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఆత్మగౌరవానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఉన్నతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఇతరుల విమర్శలను అసలు పట్టించుకోరు. సింహ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం ఒక గుర్తింపుగా ఉంటుంది. ఎవరైనా వారి ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తే, వెంటనే తిరగబడతారు.
వృశ్చిక రాశి( Scorpio )
వృశ్చిక రాశి వారు కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దృఢమైన మనస్తత్వం, ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేక స్థానంలో నిలబెడుతాయి. ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బకొడితే వారి క్షమించరు.
మకర రాశి( Capricorn )
మకర రాశి వారు కూడా ఆత్మగౌరవానికి సంబంధించి.. అత్యంత క్రమశిక్షణ, కఠిన నియమాలను పాటిస్తారు. తాము కష్టపడిన శ్రమ, క్రమశిక్షణతోనే ఆత్మగౌరవాన్ని సాధిస్తారు. ఆత్మగౌరవం విజయానికి పునాదిగా భావిస్తారు. ఆత్మగౌరవానికి హాని చేసేవారిని లెక్కచేయకుండా వదిలిపెడతారు.
కుంభ రాశి( Aquarius )
కుంభరాశివారు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలవారు. వారు తమ ప్రతిభను, శక్తిని అమితంగా గౌరవిస్తారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం వారికి ఉంటుంది. ఏ పరిస్థితులలోనూ తమ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోరు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు.