Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ప‌దోన్న‌తులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మీ కృషి ఫలిస్తుంది. ఆర్ధిక పరమైన లాభాలు మెండుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి. భావోద్వేగాలను నియంత్రించడం అవసరం. అనవసర ఖర్చులు ఉండవచ్చు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మనసుకు ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు మనోధైర్యంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఓర్పు, సహనంతో కఠిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబంలో ఆశ్చర్యం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి పరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్‌ ఛాన్స్ ఉంది. వ్యాపారంలో నూతన అవకాశాలు వ్యాపారాభివృద్ధికి తోడ్పడతాయి. ముందుచూపుతో ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఈ రోజు మీ జీవితం అనుకోని మలుపులు తిరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషి ఫలిస్తుంది. పనిఒత్తిడి అధికం కావడంతో తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో ఆర్థిక పరిస్థితి అంచనా తప్పుతుంది. కుటుంబంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శుభకాలం కొనసాగుతోంది. వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. పెట్టుబడులు, లాభాలు మీ ఆదాయాన్ని పెంచుతాయి. షేర్ మార్కెట్లో భారీ లాభాలను ఈ రోజు చూడబోతున్నారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ ప్రతిభ, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో ఆర్ధిక స్థిరత్వం సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. సహనం పాటిస్తే విజయం మీదే! కోపం అదుపులో ఉంచుకోవాలి. అధికారులతో, పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Latest News