మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరాశ పరుస్తుంది. ఎంత కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు వచ్చే సూచనలు లేవు. ప్రయాణాలు అనుకూలం కాదు. సన్నిహితులతో కీలక చర్చలకు అవకాశం ఉంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో జరిగే వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సహచరుల సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయోజనం పొందుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో దూకుడు వద్దు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. ప్రమోషన్లు ఉండవచ్చు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదురయ్యే అవరోధాలను అవకాశాలుగా మలచుకుంటే విజయం మీదే! ఇంటా బయట వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. వివాదాస్పద చర్చలకు దూరంగా ఉంటే మంచిది.
తుల (Libra)
తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. మేథోపరమైన చర్చలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పెట్టుబడులు, ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఆదాయవృద్ధి ఉంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ప్రతిఫలం రావడానికి సమయం పట్టవచ్చు. సహనంతో ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహబలం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.