మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తొలగిపోతాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణతో ఉండడం అవసరం. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అనిశ్చితి, సందిగ్దత చోటు చేసుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా అందిన కొన్ని శుభవార్తలతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ధనయోగం బలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడతారు. సమాజంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగులు అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కాలం కలిసి రానప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకుని మౌనంగా ఉండడం మంచిది. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను జాగ్రత్తగా ఆలోచించి చర్చలతో పరిష్కరించుకుంటే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులు చక్కగా రాణిస్తారు. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పరోపకార పనులు, ధార్మిక కార్యక్రమాలు విరివిగా చేస్తారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అదృష్టం వుంది. వ్యాపార సంబంధమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందరితో కలిసి ముందుకు పోవడం వల్ల సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, మేధో పరమైన చర్చలకు అనుకూలమైన సమయం. కుటుంబంతో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు ఒత్తిడి ఉండవచ్చు. ఒత్తిడి కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి. సమయం అనుకూలంగా లేని సందర్భాల్లో మౌనంగా ఉంటూ ధ్యానం చేయడం మంచిది. చట్టవిరుద్దమైన పనులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యం కారణంగా ఖర్చులు పెరగవచ్చు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలంటే వ్యూహాత్మకంగా నడుచుకోవడం అవసరం. కళాకారులు, రచయితలు నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
