Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ Ustaad Bhagat Singh పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్లీ కలవడంతో అభిమానుల్లో ఉత్సాహం పీక్‌లో ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
40 సెకన్ల టీజర్‌తో అంచనాలు మరింత పెరుగుతాయా?
తాజా సమాచారం ప్రకారం, సినిమా మార్చి 26న విడుదలకు సిద్ధమవుతుండగా, ముందుగా టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 40 సెకన్ల పాటు ఉండనున్న ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉండనున్నాయట.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీజర్‌ని మరో వారంలో విడుదల చేస్తారని అంటున్నారు. టీజర్ విడుదలైతే సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా మారతాయని అంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.
భారీ ప్రమోషన్స్‌కు మైత్రి మూవీ మేకర్స్ రెడీ
ఈ చిత్రాన్నిమైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సినిమాకు తగినట్టుగానే భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. భారీ అంచనాల నడుమ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. సురేందర్ రెడ్డితో కూడా క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీపై కూడా అంచనాలు పీక్స్ లోనే ఉన్నాయి. చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
