Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తులు క‌లిసి వ‌స్తాయి..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ పరమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. పరోపకారతత్వంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. గ్రహ స్థితి చాలా అనుకూలంగా వుంటుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. కొత్త పనులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా లేదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కొత్త పనులు మొదలు పెడితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేస్తే మంచిది. సొంత విషయాల్లో ఇతరుల జోక్యం నివారించండి. కుటుంబ కలహాల్లో శాంతం వహించండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవబలంతో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఓర్పు, సహనంతో ఉండడం అవసరం. అనవసర చర్చలు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. మిత్రుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. తోటి ఉద్యోగుల సహకారం లోపిస్తుంది. వ్యాపారంలో పోటీ పెరగడంతో విజయావకాశాలు ఆలస్యమవుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టం కలగవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నాయకత్వ లక్షణాలతో పదోన్నతులు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి సంబధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. శ్రీలక్ష్మి కటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అధికారులతో, తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. అనవసర వివాదాల్లో తల దూర్చకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరమైన పురోగతి ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ధనసంపదలు వృద్ధి చెందుతాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రారంభించిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వలన సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Latest News