Site icon vidhaatha

Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. పెద్దల సహకారంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం గురించి, సంతానం గురించి అందిన శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంది. నష్టభయం ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఒక సువర్ణావకాశం ఎదురవుతుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులకు కూడా సమయం అనుకూలంగా ఉంది. లాభాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు కూడా వసూలవుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి నిరాశ పరుస్తుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. వ్యాపారంలో నిర్లక్ష్యం కారణంగా నష్టం ఉండవచ్చు. సన్నిహితులతో ఘర్షణలు, కలహాలకు దూరంగా ఉండండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. లక్ష్యసాధనలో మీ శక్తియుక్తులు పూర్తిగా వినియోగించాలి. అడుగడుగునా శత్రువులు ఆటంకాలు సృష్టిస్తారు. మనోబలంతో పనిచేస్తే సమస్యలు అధిగమించవచ్చు. కుటుంబ వివాదాలకు అవకాశం ఉంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు, స్వస్థానప్రాప్తి ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. భూ, గృహ, ధనయోగాలున్నాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. పేరు ప్రతిష్టలకు భంగం కలిగే పనులు చేయకండి. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గృహసంచారం అనుకూలంగా ఉన్నందున ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. శుభకార్యక్రమాల్లో బంధువులతో ఉత్సాహంగా పాల్గొంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలలో దీక్ష పట్టుదలతోనే అనుకున్న ఫలితాలు పొందగలరు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రయాణాల్లో ప్రమాదం ఉంది కాబట్టి వాయిదా వేస్తే మంచిది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. లక్ష్య సాధనలో పట్టుదల పెంచాలి. కొన్ని కీలక వ్యవహారాలు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవగాహనతో మెలిగితే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ముందస్తు ప్రణాలికతో ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారులు నష్టాలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Exit mobile version