మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సంతోషంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్త వహించండి. మీ రంగాలకు సంబంధించిన పెద్దలను కలుసుకుంటారు. ఈ పరిచయాలు మున్ముందు ప్రయోగాజనకరంగా ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు పొందుతారు. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. అధికారులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించండి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దిగవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. తోబుట్టువులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. కొందరు పనికట్టుకుని ఆటంకాలు సృష్టిస్తారు. నిరాశ చెందవద్దు. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞులను సంప్రదిస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసివస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో శాంతం, సహనంతో మెలగాలి. మీ కోపం, పరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనం వహించడం మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రతిభను ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంది. ధనధాన్య లాభాలున్నాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రద్ధాలోపం లేకుండా చూసుకోండి. బంధువులతో సంబంధాలు పటిష్టం చేసుకుంటే మంచిది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గిట్టనివారి వలన హాని కలిగే ప్రమాదముంది. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఈ రోజు కళారంగం వారికి ఫలవంతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. మీ ప్రతిభకు సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీరు సాధించిన విజయం మీకు మంచి గుర్తింపు తెస్తుంది. భూ, గృహ, ధనయోగాలున్నాయి.