Site icon vidhaatha

Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అధికారం, గౌరవం, పరపతి పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. వ్యాపారులు పెద్ద ప్రాజెక్టు అందుకుంటారు. ఈ సమయంలో చేసే వ్యాపార లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. వృత్తిపరంగా ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలతో మీ ఉత్సాహం పెరుగుతుంది. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాల నుంచి శుభప్రదమైన వార్త వస్తుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అనూహ్య ధనలాభాలు అందుకుంటారు. తారాబలం అనుకూలిస్తోంది కాబట్టి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శుభ సమయం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో తీరికలేని పనులతో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా నడుచుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. సమస్యలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు తమ పోటీదారులను అధిగమిస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిర్లక్ష్యం లేకుండా పట్టుదలతో పనిచేయాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఎవరికీ అప్పు ఇవ్వడం గాని, తీసుకోవడం గాని చేయవద్దు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం అలుపెరగకుండా శ్రమిస్తారు. అయినప్పటికీ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం నిరాశ కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ పెట్టడం అవసరం.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కాలం అంతగా సహకరించడం లేదు. గొప్ప ప్రయత్నంతోనే తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదానికి దూరంగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి పెరగవచ్చు.

Exit mobile version