Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో అధికార యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శత్రుభయం ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో మనోధైర్యం ప్రధానం. బుద్ధిబలంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులు ముందుచూపుతో సవాళ్లు అధిగమిస్తారు. ఆశించిన లాభాలు అందుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సంఘటన సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెంచుకోడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్య సాధన కోసం నిరంతర సాధన చేయాల్సి ఉంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారంలోకి డబ్బురాక పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వృత్తి పరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. క్లిష్ట సమయాల్లో బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. అనవసర వ్యవహారాలు, వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. సహనంతో ప్రయత్నిస్తే పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయండి.

Latest News