వైరల్ గా.. నల్లగొండ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల!

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు భారీ స్థాయిలో తరలివచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో కొత్త సినిమా మార్నింగ్ షో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడినట్లుగా...ఆ పాఠశాలలో అడ్మీషన్ల కోసం తల్లిదండ్రులు పోటీ పడిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేట్ స్కూల్ సీట్ల కోసం కనిపించే డిమాండ్ ఇక్కడ కనిపించింది.

విధాత : ప్రభుత్వ విద్యా, వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోయి..ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్న ప్రజల వ్యథలు నిత్యం సాధారణంగా మారిపోయాయి. ఇలాంటి రోజుల్లోనూ నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రజలను ఆకర్షిస్తూ..సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల(Komatireddy Prateek government school) లో అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు భారీ స్థాయిలో తరలివచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో కొత్త సినిమా మార్నింగ్ షో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడినట్లుగా…ఆ పాఠశాలలో అడ్మీషన్ల కోసం తల్లిదండ్రులు పోటీ పడిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేట్ స్కూల్ సీట్ల కోసం కనిపించే డిమాండ్ ఇక్కడ కనిపించింది. తెల్లవారుజాము నుంచే తల్లి దండ్రులు అడ్మిషన్ల కోసం క్యూ కట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు…ప్రజలు అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇలాగే మార్చొచ్చు కదా..! అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదండోయ్ ..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట వేలకోట్లు తగలెట్టే బదులు.. ఉన్న స్కూళ్లలో ప్రతీక్ స్కూల్ మాదిరిగా సౌకర్యాలు మెరుగుపరచొచ్చు కదా.! అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. ఒక్కో స్కూలుకు రూ.200 కోట్లు పెట్టాల్సిన అవసరంలేదని.. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాలు కల్పించవచ్చని.. ఇందుకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను రోల్ మోడల్ గా భావించవచ్చంటూ సూచిస్తున్నారు. నల్గొండలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో తన దివంగత కుమారుడు ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంత్రి వెంకట్ రెడ్డి రూ.8కోట్ల వ్యయంతో ఈ పాఠశాలను అన్ని సౌకర్యాలతో నిర్మింపచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అరుదుగా కనిపించే స్మార్ట్ క్లాసులు, ఏఐ (AI) ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు ఆధునికమైన విద్యా బోధన అందించే ఏర్పాటు చేశారు. కార్పోరేట్ స్కూల్ తరహాలో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వసతులు అందనుండటంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు.

 

Latest News