Sudigali Sudheer | మ్యాజిక్ షోలతో కెరీర్ ప్రారంభించి, టీవీ షోలతో స్టార్‌గా ఎదిగిన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కామెడీ షోల నుంచి సినిమాల వరకు తన ట్యాలెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా కూడా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండటం తరచూ చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సుధీర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావోద్వేగ విషయాలను మరోసారి పంచుకున్నారు. ముఖ్యంగా తన తొలి ప్రేమ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
14 సంవత్సరాలు ప్రేమ..
సుధీర్ మాట్లాడుతూ, తన ఫస్ట్ లవ్ దాదాపు 14 సంవత్సరాల పాటు కొనసాగిందని వెల్లడించారు. స్కూల్ రోజుల నుంచే మా పరిచయం, ప్రేమ మొదలైంది. నేను హైదరాబాద్‌కి వచ్చి కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎందుకు ఇలా చేశావని అడిగితే, ‘నేను హ్యాపీగా ఉన్నాను.. నన్ను డిస్టర్బ్ చేయకు’ అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ రోజు నెక్లెస్ రోడ్ వద్ద పరిగెత్తుతూ నా బాధను బయటపెట్టాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా తన బ్రేకప్ గురించి స్పందించిన సుధీర్, ఆ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని చెప్పాడు.
ఆమె వల్లనే ఈ స్టేజ్‌లో..
ఆ సమయంలో ఆమె పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. కానీ నేను డిప్రెషన్‌లోకి వెళ్లినా, నా మీద ఆధారపడిన కుటుంబం ఉండటంతో పని మీద ఫోకస్ పెట్టాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని తెలిపారు.ఆ రోజు ఆమె బ్రేకప్ చెప్పకపోతే నేను ఈరోజు ఇంత సక్సెస్ అయ్యేవాడిని కాదేమో. ఇప్పుడు నాకు ఇంతమంది అభిమానులు ప్రేమ ఇస్తున్నారు. అందుకే ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తుంది అంటూ తన పెద్ద మనసును చాటుకున్నారు.
సుధీర్ చెప్పిన ఈ నిజజీవిత కథ ఇప్పుడు అభిమానులను కదిలిస్తోంది. ప్రేమలో ఎదురైన విఫలం తనను మరింత బలంగా మార్చిందని, జీవితంలో ఎదగడానికి అది ఒక టర్నింగ్ పాయింట్‌గా మారిందని ఆయన చెప్పడం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.
