OTT Movies | ఈ వారం మూవీ ల‌వ‌ర్స్‌కి పండగే.. థియేట‌ర్స్‌తో పాటు ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఏంటి?

OTT Movies | ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినిమా అభిమానులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. గత వారం విడుదలైన సినిమాలు ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో కొనసాగుతుండగా, ఈ వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని థియేటర్లలో పలు చిత్రాలు విడుదలవుతుండగా, ఓటీటీలో పెద్ద సంఖ్యలో రిలీజ్‌లు ఉండటం విశేషం.

OTT Movies | ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినిమా అభిమానులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. గత వారం విడుదలైన సినిమాలు ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో కొనసాగుతుండగా, ఈ వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని థియేటర్లలో పలు చిత్రాలు విడుదలవుతుండగా, ఓటీటీలో పెద్ద సంఖ్యలో రిలీజ్‌లు ఉండటం విశేషం.

ఈ వారం థియేటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది డెకాయిట్. ఇందులో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్-లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు షానియల్ డియో రూపొందించారు. హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించడం సినిమాకు మరింత హైలైట్‌గా మారింది. అలాగే అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

డ‌బ్బింగ్ సినిమాల‌పై కూడా ఆస‌క్తి..

ఇక కోలీవుడ్ నుంచి వస్తున్న Love Insurance Kompany (LIK) కూడా యూత్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు. హీరోయిన్‌గా కృతి శెట్టి నటించారు. టెక్నాలజీ ప్రభావం ప్రేమ సంబంధాలపై ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.

మలయాళం నుంచి వస్తున్న పల్లి చట్టంబి కూడా ఈ వారం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇందులో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించారు. 1950-60ల కాలం నేపథ్యంలో సాగిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.

ఓటీటీలోను సంద‌డే సంద‌డి..

ఇక ఓటీటీ విషయానికి వస్తే, ఈ వారం నిజంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ అనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోని లివ్, జీ5, స‌న్ నెక్ట్స్, యాపిల్ టీవీ ప్ల‌స్ , ల‌య‌న్ స్టేజ్ ప్లే వంటి ప్రముఖ ప్లాట్‌ఫార్మ్‌లు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో- క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ – ఏప్రిల్ 10), బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ – ఏప్రిల్ 8) అందుబాటులోకి రానున్నాయి. నెట్ ఫ్లిక్స్ – బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 8), బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ – ఏప్రిల్ 9), 18th రోజ్ (మూవీ – ఏప్రిల్ 9), తు యా మై (హిందీ మూవీ – ఏప్రిల్ 10), త్రాష్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10), సన్ నెక్స్ట్ – హాళ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10), కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10) జీ5 – ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ – ఏప్రిల్ 10) , జియో హాట్ స్టార్ – తాయి కిళవి (తమిళ మూవీ – ఏప్రిల్ 10), సోనీ లీవ్ – తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ – ఏప్రిల్ 10) ,యాపిల్ టీవీ ప్లస్ – ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10) లయన్స్ గేట్ ప్లే – వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ – ఏప్రిల్ 10) ఇలా ప‌లు చిత్రాలు ఓటీటీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాయి.

మొత్తంగా చూస్తే, ఈ వారం థియేటర్లు మరియు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో విభిన్న జానర్లలో భారీగా కంటెంట్ విడుదలవుతోంది. యాక్షన్, ప్రేమ, థ్రిల్లర్, డ్రామా ప్రతి జానర్ ప్రేక్షకులకు ఈ వారం పూర్తి వినోదాన్ని అందించనుంది. దీంతో మూవీ లవర్స్‌కు ఈ వారం నిజంగా పండుగ వాతావరణమే.

Latest News