Actress | సినిమా తారలకు ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ కనిపించినా అభిమానులు గుమిగూడటం సహజం. అయితే ఇటీవల కాలంలో అభిమానం పేరుతో కొందరు చేస్తున్న అతి సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. బహిరంగ కార్యక్రమాల్లో, ప్రమోషన్లలో, షాపింగ్ మాల్ ఈవెంట్లలో అనుమతి లేకుండా తాకడం, దగ్గరకు రావడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.
హనీరోజ్‌కి కూడా చేదు అనుభవం..
ఇటీవల మలయాళ నటి హనీ రోజ్ కేరళలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.
మంజూ వారియర్ విషయంలో కూడా..
తాజాగా మరో మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్‌కూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. పాలక్కాడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఒక మహిళా అభిమాని అకస్మాత్తుగా ముందుకు వచ్చి అందరూ చూస్తుండగానే మంజు వారియర్‌కు బలవంతంగా ముద్దు పెట్టడం షాక్‌కు గురిచేసింది.
ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన ఈవెంట్ యాంకర్, అతిథులతో ఇలాంటి ప్రవర్తన అనుచితం అని స్పష్టం చేస్తూ అభిమానులకు హెచ్చరిక జారీ చేశారు.
కూల్‌గా స్పందించిన మంజూ..
అభిమాని అలా ప్రవర్తించినప్పటికీ, మంజు వారియర్ మాత్రం ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. చాలా హుందాగా, కూల్‌గా స్పందిస్తూ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె సహనం, ప్రొఫెషనలిజంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మంజు వారియర్, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన పలు చిత్రాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు సినీ ప్రముఖుల భద్రతపై మరింత జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నాయి.
A woman fan kissed actress Manju Warrier on the lips 😮
🙏🏃#Manjuwarrier #Actress #Mollywood pic.twitter.com/k8Eyz3CAAj— ananthu___ (@AnanthuBackup) April 5, 2026
