AIIMS | మీరు బీఎస్సీ నర్సింగ్( BSc Nursing ) కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే.. దేశవ్యాప్తంగా ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS )ల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్( Nursing Officer ) పోస్టుల భర్తీకి నిర్వహించే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్( Nursing Officer Recruitment )కు నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ పోస్టుల భర్తీకి కావాల్సిన అర్హతలు, తదితర వివరాలను తెలుసుకుందాం.
పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 3500
పేస్కేల్: గ్రేడ్ పే రూ.4,600/- (రూ.9,300-34,800)
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు ఎవరు..?
బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం డిప్లొమాతో పాటు రెండేండ్ల పని అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్/పోస్ట్ బేసిక్) బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఐదేండ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌వోఆర్ సెట్)-09
ఇది రెండు దశల్లో జరుగుతుంది.
స్టేజ్-1 ఇది క్వాలిఫైయింగ్ పరీక్ష, దీనిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఇస్తారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు కోతవిధిస్తారు
స్టేజ్-2:
ఈ పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు. దీనిలో నర్సింగ్ సబ్జెక్టుపై ప్రశ్నలు ఇస్తారు
నోట్: స్టేజ్-1,2 సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ : ఆగస్టు 11
సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 14
సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 27
వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in