TGT Posts | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSB).. గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో టీజీటీ పోస్టుల( TGT Posts ) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు- 5346
పోస్టులు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), డ్రాయింగ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్
సబ్జెక్టులు: మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, నేచురల్ సైన్స్, హిందీ, సంస్కృతం, ఉర్దూ, పంజాబీ
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?
– భారతీయులై ఉండాలి
– పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీతోపాటు బీఈడీ, బీఈఐ లేదీ ఈడీ (డ్రాయింగ్/పెయింటింగ్/ఫైన్ ఆర్ట్స్)లో ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి
వయస్సు: 2025, నవంబర్ 7 నాటికి 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.44,900-1,42,400/-
ఎంపిక విధానం
– వన్ టైర్ (టెక్నికల్/టీచింగ్) విధానంలో ఎంపిక ఉంటుంది.
– పరీక్షలో 200 ప్రశ్నలు – 200 మార్కులు.
– పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
– పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
నోట్: అవసరమైన పోస్టులకు స్కిల్‌టెస్ట్/ పీఈటీ తదితర టెస్ట్‌లు నిర్వహిస్తారు.
నోట్: కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఢిల్లీ ఎన్‌సీటీ నిబంధనల ప్రకారం ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 9 నుంచి
చివరితేదీ: నవంబర్ 7
వెబ్‌సైట్: dsssb.delhi.gov.in/dsssb-vacancies