Actor Suman | విధాత : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని..ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు నాకు టికెట్ ఇస్తామని కొందరు ఆహ్వానిస్తున్నారని సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుంటూరులో పర్యటించిన సుమన్ మీడియాతో మాట్లాడారు. నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే అన్నారు. అయితే అక్కడ ఎన్నికల్లో పోటీ అంశంపై ఆలోచించి చెబుతానని చెప్పడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ రాజకీయాలలో పోటీ విషయం అప్పుడే చెబుతానని సుమన్ తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఇందుకు అంతా సహకరంచాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయన్నారు. గతంలో ఏపీలో వైసీపీ, టీడీపీల నుంచి రాజమండ్రి ఎంపీగా సుమన్ కు ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Actor Suman : రాజకీయ ప్రవేశంపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు సుమన్ రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీ ఆహ్వానం వచ్చిందని.. ఆలోచించి చెబుతానన్నారు.

Latest News
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మరి మీ రాశి ఉందా..?
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగాలున్నాయి..!
వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్
వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు: మంత్రి కోమటిరెడ్డి
సర్పంచ్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ అభినందనలు