Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు జీవిత భాగ‌స్వామితో జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించడం వలన ఖర్చులు అదుపులోనే ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా మెలగడం మంచిది. సమయపాలన, క్రమశిక్షణతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిరీత్యా మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండండి. కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన గృహనిర్మాణం పనులు జోరందుకుంటాయి. ఆర్థికంగా మేలైన సమయం.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో అద్భుతమైన యోగంవుంది. ఎంత గొప్ప కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆర్థికంగా ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిరీత్యా పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. సంకల్పసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ పరంగా మేలైన కాలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉన్నతమైన ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పట్టుదలతో కీలక వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, పనిభారం పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. కొన్ని అనుకోని ఘటనలు ఆందోళన కలిగిస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదముంది. ఖర్చులు అదుపు చేయండి. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు లౌక్యంగా ఉండండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. మీ మనోధైర్యం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కోపతాపాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు విజయం, కీర్తి, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగులు తోటి ఉద్యోగుల సహకారం పొందుతారు. వ్యాపారంలో సమష్ఠి నిర్ణయాలు మేలు చేస్తాయి. మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారాలు విదేశీ పెట్టుబడుల నుంచి ధనప్రవాహాన్ని అందుకుంటారు. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది.

Latest News