Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vidhaatha Weekly Horoscope

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్పష్టమైన పురోగతి గోచరిస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు, జీతం పెరుగుదల అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. వ్యాపార వృద్ధికి లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదలతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు తమ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. మీ ప్రతిభకు, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలలో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు ఈ వారం స్థానచలన సూచన ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ధనయోగం ఉంది. లాభాలలో వృద్ధి, స్పష్టంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు వ్యాపార విస్తరణకు దారితీస్తాయి. ఆర్థిక స్థితి పటిష్టంగా ఉంటుంది. భూ, గృహ ధనయోగాలున్నాయి. ఆస్తులు వృద్ధి చేస్తారు. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఉద్యోగంలో స్థిరత్వం కోసం గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. పనిప్రదేశంలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో వ్యవహరించడం వల్ల క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెరగడంతో లాభాలు కూడా పెరుగుతాయి. వ్యాపారాన్ని క్రమంగా దూరప్రాంతాలకు విస్తరిస్తారు. వ్యాపారంలో ఎదురయ్యే పోటీ, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. డబ్బుకు లోటుండదు కానీ వృథా ఖర్చులు నివారించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరంగా సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఆచి తూచి అడుగేయాలి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గిస్తే మంచిది. సహోద్యోగులతో, అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో పురోగతి నిరాశ పరుస్తుంది. లాభాలు పెరగడానికి వ్యాపారులు కొత్త వ్యూహాలను అవలంబించాలి. ధననష్టం కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల నుంచి డబ్బు రాకతో ఆనందంగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలకు అవకాశం లేకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరమైన వృద్ధి, ఆర్థిక పురోగతికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. స్వయంకృషితో, అద్భుతమైన నైపుణ్యాలతో ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరిధి విస్తరించడంతో మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు. మెరుగైన ఆర్థిక అవకాశాలు లభించడంతో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. రుణభారం తగ్గుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి, ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుభవజ్ఞుల సలహాలతో వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు. అయితే కృషి, పట్టుదలతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యాపారంలో పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. రియల్ ఎస్టేట్ రంగాల వారు మంచి లాభాలు గడిస్తారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు అవగాహనతో తొలగుతాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ వారాంతానికి అన్ని సర్దుకోవడంతో సానుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో స్నేహసంబంధాలు బలపడతాయి. అందరి సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు నూతన వ్యూహాలు అనుసరించి మంచి లాభాలు గడిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో సమస్యలు తొలగుతాయి. కుటుంబ పెద్దల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పురోగతి ఆనందం కలిగిస్తుంది. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. లాభాలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే కీలక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా మేరకు నడుచుకోవడం మంచిది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఎదుగుదలకు మెరుగైన అవకాశాలు ఎదురవుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. స్థిరాస్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చి పెడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం సహకరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తిపరమైన పురోగతి గోచరిస్తోంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం, అధికారుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. నిరంతర కృషితో పదోన్నతులు అందుకుంటారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారులకు అనువైన సమయం. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. రుణభారం తొలగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఎంత శ్రమ పడితే అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. విదేశీయానంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఇతరుల సహకారంతో ఆశించిన విజయాలు అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ బంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార పరంగా ఈ వారం అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పుతో వేచి చూడడం అవసరం. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తారు.

Latest News