భర్త మహాశయులకు విజ్ఞప్తి – రవితేజ తీసుకొచ్చిన పండగ నవ్వుల ప్యాకేజ్?

సంక్రాంతి 2026కి వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో రవితేజ తన కామెడీ టైమింగ్‌తో కొన్ని భాగాల్లో నవ్వించాడు. కథ కొత్తదేమీ లేకపోయినా, సత్య–వెన్నెల కిశోర్–సునీల్ వినోదం పండించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పండగ సీజన్‌లో లైట్‌గా చూడదగిన టైమ్‌పాస్ చిత్రం.

Ravi Teja greeting with folded hands in the official Vidhaatha review poster of Bharatha Mahashayulaku Vignapthi.

Bharatha Mahashayulukku Vignapthi Review: Ravi Teja Banks on Comedy in a Festive Family Entertainer

🔶 సారాంశం:

భార్య–ప్రియురాలి మధ్య నలిగిపోయే భర్త కథతో వచ్చిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సంక్రాంతి కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న లైట్‌వెయిట్ కామెడీ డ్రామా. ఫస్టాఫ్‌లో రవితేజ, సత్య, వెన్నెల కిశోర్ సీన్లతో నవ్వులు పండుతాయి. సెకండాఫ్‌లో సునీల్ ఎంట్రీతో ఫన్ కొంచెం బెటర్ అవుతుంది కానీ కథనం,  క్లైమాక్స్ మాత్రం బలహీనంగా ఉంటాయి.

విధాత సినిమా సమీక్ష

సంక్రాంతి సీజన్‌కు ప్రేక్షకులు కోరేది ప్రధానంగా సరదాగా,  కుటుంబ భావోద్వేగాలతో,  సరిపోయే హీరోయిజం ఉన్న సినిమా. సరిగ్గా ఇదే ఫార్ములాతో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ముందుకు వచ్చాడు. నిన్నవరుస ఫ్లాపుల తర్వాత ఆయన ప్రేక్షకుల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన సమయం ఇది. మరి ఈ సినిమా ఆ అవకాశం ఇచ్చిందా? చూద్దాం.

—————-

చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి

తారాగణం: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్, సత్య, వెన్నెల కిషోర్, మురళిధర్ గౌడ్, గెటప్ –శ్రీను, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

–కెమెరా: ప్రసాద్ మూరెళ్ల

సంగీతం: భీంస్ సిసిరీలియో

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: కిషోర్ తిరుమల

విడుదల: 13 జనవరి 2026

—————-

కథేంటి?

రామ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ బ్రాండ్ యజమాని. తన ‘అనార్కలి వైన్’ను ఒక స్పెయిన్ కంపెనీకి పరిచయం చేయడానికి అక్క‌డికి వెళ్తాడు. ఆ కంపెనీ అధిపతి మానస (ఆషికా రంగనాథ్)తో ఏర్పడిన వ్యాపార సంబంధం వ్యక్తిగతంగా మారుతుంది. తనకు పెళ్లయిందన్న విషయం దాచిపెట్టి ఆమెతో బంధాన్ని కొనసాగించడమే అసలు కన్‌ఫ్లిక్ట్.

ఇక్కడ భారత్​లో భార్య బాలామణి (డింపుల్ హయాతి) తన భర్త పై పూర్తిగా నమ్మకంతో సంసారం సాగిస్తుంది. ఒక రోజు మానస హైదరాబాద్‌కు చేరుకునేసరికి పరిస్థితి తారుమారు అవుతుంది. ఇటు భార్య, అటు ప్రేయసి…
మధ్యలో రామసత్యనారాయణ ఎన్నుకున్న మార్గం ఏమిటి? చివరికి ఎవరి వైపు నిలుస్తాడు? అదే సినిమా ప్రధాన కథ.

నటీనటుల ప్రదర్శన

రవితేజ

తన టైమింగ్, ఎనర్జీ, సున్నితమైన హాస్యాన్ని పండించడంలో ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇద్దరు భామల మధ్య ఇరికి, నలిగిపోయే సన్నివేశాల్లో ఆయన నట ప్రేక్షకులను నవ్విస్తాయి.

ఆషికా రంగనాథ్

గ్లామర్, హుందాతనం రెండూ సమానంగా పోషించింది. స్పెయిన్ ఎపిసోడ్స్‌లో పాత్ర బాగా నటించింది. మంచి స్కోప్​ ఉన పాత్రలో బాగా ఇమిడిపోయింది.

డింపుల్ హయాతి

భార్యగా తన పాత్రకు సరిగ్గా సరిపోయింది కానీ ఎక్కువ నిడివి లేదు.

సహ నటులు

సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ముగ్గురూ తమ కామెడీతో సినిమాకు మంచి బలాన్ని అందించారు. ముఖ్యంగా సత్య చేసిన ఇమిటేషన్‌లు, సునీల్ ట్రాక్, కిశోర్ చిన్న చిన్న పంచులు మాత్రం ప్రేక్షకులకు మంచి  వినోదాన్ని పంచాయి.

సాంకేతిక విలువలు

దర్శకత్వంకిశోర్ తిరుమల
కుటుంబ భావోద్వేగాలను బలంగా రాసుకునే దర్శకుడు అయినా ఈసారి ఆయన ప్రధానంగా కామెడీ మీదే దృష్టి పెట్టారు. అయితే కథనంలో కొత్తదనం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

సంగీతంభీంస్ సిసిరోలియో
పాటలు వినసొంపుగా ఉండి, పండగ మూడ్‌కు సరిపోయాయి. “బెల్లా బెల్లా” వంటి డాన్స్​ నెంబర్ బాగుంది. బీజీఎం యావరేజ్​.

కెమెరాప్రసాద్ మూరెళ్ల
స్పెయిన్ విజువల్స్, ఇంటీరియర్ ఫ్రేమింగ్, కలర్ టోన్—అన్నీ కన్నులకింపుగా తెరకెక్కించాడు.

ఎడిటింగ్శ్రీకర్ ప్రసాద్
ఫస్ట్ హాఫ్ పరవాలేదు కానీ, సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసర సీన్లు కత్తిరిస్తే ఇంకా చక్కగా ఉండేది.

బలాలుబలహీనతలు

బలాలు

బలహీనతలు

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథలో కొత్తదనం లేకున్నా, కామెడీతో కొంత వరకు ఎంజాయ్ చేయగలిగే టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్. రవితేజ ఎనర్జీ, సత్య– వెన్నెల కిశోర్ –సునీల్ హాస్యం సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది.

పండగ రోజుల్లో కొన్ని నవ్వులు కావాలనుకుంటే ఒకసారి చూడదగిన రవితేజ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

విధాత రేటింగ్: 2.5/5

Latest News