Sharwanand | క్లాస్ హీరో నుంచి మాస్ అవతారంకి మారిన శ‌ర్వానంద్… లుక్ చూసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ అంటే ఇప్పటివరకు ప్రేక్షకులకు గుర్తొచ్చేది క్లాస్ లుక్, పక్కింటి అబ్బాయి ఇమేజ్. కానీ గత కొంతకాలంగా ఆయన ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని స్పష్టమవుతోంది.

Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ అంటే ఇప్పటివరకు ప్రేక్షకులకు గుర్తొచ్చేది క్లాస్ లుక్, పక్కింటి అబ్బాయి ఇమేజ్. కానీ గత కొంతకాలంగా ఆయన ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇటీవల ‘నారి నారి నడుమ మురారి’తో మంచి విజయాన్ని అందుకున్న శర్వా, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు.

భోగి ఫ‌స్ట్ లుక్..

తాజాగా విడుదలైన భోగి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న శర్వాను చూసి “ఇది నిజంగా శర్వానందేనా?” అని ఆశ్చర్యపడేలా మేకోవర్ ఉంది. ఒత్తైన గడ్డం, గుబురు మీసం, రింగుల జుట్టుతో పూర్తి రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ముందుగా భారీ వేటకొడవలి ఉంచుకుని, కళ్లలో నిప్పులు చెరిగేలా చూస్తున్న శర్వాను చూస్తే సినిమాలో ఆయన ‘బీస్ట్ మోడ్’లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

‘ఏ బ్లడ్ ఫెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే పోస్టర్‌లో తీవ్రత కనిపిస్తోంది. శర్వా కెరీర్‌లోనే ఇది మోస్ట్ మాస్ మేకోవర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

1960ల నేపథ్యం… రస్టిక్ యాక్షన్ డ్రామా

ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల కాలం నాటి ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథ సాగనుంది. ఆ కాలం నాటి రా అండ్ రస్టిక్ ఫీల్ తెరపై చూపించేందుకు చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతోంది. ప్రముఖ యాక్షన్ దర్శకుడు దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని నెటిజన్లు అంటున్నారు.

స్టార్ కాస్ట్ – భారీ నిర్మాణం

ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘భోగి’ చిత్రాన్ని 2026 ఆగస్టు 28న రక్షాబంధన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్

‘భోగి’ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లాస్ హీరోగా పేరుగాంచిన శర్వానంద్ ఇలాంటి పూర్తి మాస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 28పైనే ఉంది. ఆ రోజు శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

Latest News