విధాత:స్టార్ హీరోల బర్త్‌డే అంటే అభిమానులకు పండగతో సమానం. వారి బర్త్‌డే రోజు ఏం చేయాలా? అని ఎప్పటి నుంచో ప్లాన్‌లు వేసుకుంటూ ఉంటారు. తీరా పుట్టినరోజు నాడు వారు చేసే సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు కళ తప్పింది. కరోనా కాలంలో బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దంటూ హీరోలు అభిమానులకు సూచిస్తూ వస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

ఈమేరకు సోషల్ మీడియాలో ఒక లేఖను విడుదల చేశాడు.
గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను.
Latest News
పొలం బాటలో సాగుదాం రండి: రైతు బిడ్డలకు భూమి సునీల్ పిలుపు
సీఎం విజయ్ బర్త్ డే.. వారికి ఉచిత బంగారు ఉంగరాలు!
టాక్సీ పనిపై వెళ్లాడు..రూ.3కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టాడు!
సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను దంచేసిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో వైరల్
పెరిగిన బంగారం..తగ్గిన వెండి ధరలు
రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ తో 4 కోట్ల తెలంగాణకు నష్టం : కేటీఆర్
ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా ప్రకటన
ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
క్లీంకార ఫేస్ రివీల్ చేసిన ఉపాసన..వైరల్