విధాత : యువ నటీనటులు మౌలి, శివానీ నాగారం కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ నుంచి గురువారం ‘రాజాగాడికి..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈటీవీ విన్‌ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘రాజాగాడికి..’ అంటూ సాగే లిరికల్ వీడియోను పంచుకుంది.
సింజిత్ ఎర్రమిల్లి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. సంజిత్ హెగ్డే ఆలపించారు. యువతను ఆకట్టుకునేలా ఉన్న‘లిటిల్ హార్ట్స్’ సినిమా కథకు తగ్గట్లుగానే ఈ పాట కొనసాగడం విశేషం.
