Mega Victory | మెగా విక్ట‌రీ బాండింగ్.. చిరు, వెంకీల ఆత్మీయ‌తకి ఫిదా అయిన ఫ్యాన్స్

Mega Victory | మెగాస్టార్ చిరంజీవి–విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజ్ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో వెంకటేష్ ఓ ప్రత్యేకమైన కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Mega Victory | మెగాస్టార్ చిరంజీవి–విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజ్ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో వెంకటేష్ ఓ ప్రత్యేకమైన కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంక్రాంతి 2026 రిలీజ్ లక్ష్యంగా టీమ్ నాన్‌స్టాప్‌గా షూట్ పూర్తి చేస్తోంది. తాజాగా వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూట్ ముగిసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో చిరంజీవి–వెంకటేష్‌ల మధ్య ఉన్న అనుబంధం సోషల్ మీడియా పోస్టుల్లో స్పష్టంగా కనిపించింది.

“చిరంజీవితో నటించడం నా కల నెరవేరింది” – వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్

వెంకటేష్ తన పాత్ర ముగిసిన సందర్భంగా భావోద్వేగంగా స్పందించారు. చిరంజీవితో కలిసి నటించడం చాలా కాలం నుంచి తన కోరికగా ఉండేద‌ని పేర్కొన్నారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నా పాత్ర చిత్రీకరణ ముగిసింది. చిరంజీవిగారితో కలిసి పనిచేయడం ఒక అద్భుత అనుభవం. ఇది నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చింది. చాలా ఏళ్లుగా మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవాలని కోరుకున్నాను. చివరకు ఆ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.

“వెంకీ బ్రదర్.. మీ ఎనర్జీ స్పెషల్” – చిరంజీవి రిప్లై

వెంకటేష్ పోస్ట్ పై చిరంజీవి కూడా వెంటనే స్పందించారు. తనతో కలిసి పనిచేసిన రోజుల్ని చిరు ఎంతో ప్రేమగా గుర్తుచేసుకున్నారు. “మై డియర్ బ్రదర్ వెంకీ.. ఈ సినిమాలో నాతో కలిసి పనిచేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రజెన్స్ ఎనర్జీని, ఆనందాన్ని తీసుకొచ్చింది. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాకు మీరు స్పెషల్ టచ్ అందించారు. మనం కలిసి వర్క్ చేసిన ఆ పది రోజుల్లో ప్రతి క్షణం నేను ఆస్వాదించాను. అని రాసుకొచ్చారు.

చిరంజీవి–వెంకటేష్‌ల మధ్య కనిపించిన ఈ హృదయపూర్వక అనుబంధం అభిమానులను మరింత ఎక్సైటెడ్‌గా మార్చింది. ఇద్దరి పోస్టులకు స్పందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పని చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. వారిద్దరి ఎనర్జీ సినిమా లెవెల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్ చాలా అరుదు. అందుకే ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ పై ప్రేక్షకుల్లో భారీ బజ్ నెలకొంది. అనిల్ రావిపూడి స్టైల్‌లో ఎమోషన్, కామెడీ, స్టార్డమ్ ప్యాకేజీగా ఈ చిత్రం ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి.

Latest News