Raja Saab | ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారిగా హారర్ అండ్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్రబృందంతో పాటు భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీతో ఈవెంట్ ప్రాంగణం అంతా అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది.
అయితే ఈ ఈవెంట్‌లో హీరోయిన్ రిద్ది కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన ఆమె, ప్రభాస్ గారితో ‘ది రాజాసాబ్’ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఒక చీరను ఇచ్చారు. అది నాకు చాలా స్పెషల్. అందుకే ఈరోజు ఈ ఈవెంట్‌కు ప్రభాస్ ఇచ్చిన ఆ చీరలోనే వచ్చాను అని చెప్పింది. రిద్ది కుమార్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అభిమానులు ‘ప్రభాస్.. ప్రభాస్..’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ ఈవెంట్‌తో ‘ది రాజాసాబ్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సంజయ్ దత్, జరీనా వాహెబ్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
